పుట:Womeninthesmrtis026349mbp.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

123

"సీమంతోన్న యనం ప్రథమేగర్భేచతుర్థేమాసే "
(ఆ.గృ.సూ.6-14)

(సీమంతోన్నయనమను సంస్కారము స్త్రీకి ప్రథమగర్భమందు నాల్గవమాసమున చేయవలెను.)

గర్భము స్ఫుటమగుటతోడనే పుంసవనమను సంస్కారముచేయవలెను. ఇది పుష్యమీ నక్షత్రమున చేయబడును.

"పుగ్‌సువనం వ్యక్తేగర్భేతిష్యేణ"
(ఆ.గృ. 6-14-9)

గర్భిణిపురుష శిశువును గనవలెనను కోరికతో నిదిచేయబడును. సుఖప్రసవము గల్గుటకై "క్షిప్రగ్‌సువన" మను కర్మచేయబడును.

    "యదిజరాయు నపతేదేవం
     విహితాభిరేవాద్భిరుత్తరాభ్యామవోక్షేత్"
(ఆ.గృ.సూ. 6-14, 15)

(మావివడనిచో "అనాప్రీతేనశరావేణ" అనుదానిచే తీసికొనబడిన యుదకముచేత "ఐతుగర్భోఅక్షితః" అను రెండుఋక్కులతో నామెను మార్జనచేయవలెను.)

పైకర్మలన్నిటిలోను గృహ్యసూత్రములు మంత్రవినియోగమును చెప్పుచున్నవి. జననమయినపిమ్మట జరుగు జాతకర్మనామకరణాన్న ప్రాశన చౌలములు స్త్రీకి మంత్రరహితములుగనే జరుగునని యిదివరలో చూచియున్నాము.