పుట:Womeninthesmrtis026349mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

స్మృతికాలపుస్త్రీలు

     "నస్త్రీజుహాయాత్"
      "నానుపేతః"
(ఆ.ధ.2-15-17, 18)

(స్త్రీయుననుపనీతుడును హోమము చేయరాదు)

కావుననే స్త్రీచేయవలసియున్న లాజహోమముగూడ వరుడే చేయుచు 'జుహోతీయంనారీ' (ఈస్త్రీహోమము చేయుచున్నది) అని చెప్పును.

జుహోతీయం నారీతి.

(ఆ.గృ.సూ. 2-4-5)

భర్తవేయుబలులు గాక భార్య ప్రతిసాయంకాలమునను బలివేయవలెను. ఆమె మంత్రము లేకుండనే యట్లు వేయవలెను.

     సాయంత్వన్న స్య సిద్ధస్యపత్న్యమంత్రం బలింహరేత్
     వైశ్వదేవంహి నామైతత్సాయం ప్రాతర్విధీయతే.
(మను. 3-121)

(సాయంకాలము వండినయన్నమును పత్నిమంత్రరహితముగ బలివేయవలెను. ఇదియు వైశ్యదేవమే)

స్త్రీ గర్భిణియై యున్నప్పుడు ప్రత్యేకముగ కొన్నిసంస్కారములను పొందవలెను. ఇందు కొన్ని గర్భస్థశిశువు నుద్దేశించి చేయబడునవే. కొన్నిటియందు మంత్రాలను గూడ పఠింపవలసియుండును.