పుట:Womeninthesmrtis026349mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

121

"నాస్తిస్త్రీణాం క్రియామంత్రై రితిధర్మో వ్యవస్థితః

(మను 9-18)

(స్త్రీలకు సమంత్రకమగు క్రియకూడదని ధర్మము)

ఈకర్మలయినపిమ్మట పురుషున కుపనయనమును స్త్రీకి వివాహమునునగును. వివాహము వైదికముగనే జరుగును.

    "వైవాహికోవిధిస్త్రీణాం సంస్కారోవైదికస్స్మృతః"

    (స్త్రీలకువివాహ సంస్కారము వైదికము)

    "తూష్ణీమేతాః క్రియాఃస్త్రీణాం
     వివాహస్తు సమంత్రికః"
(యాజ్ఞ 1-18)

(ఈక్రియలుస్త్రీల కూరకనేచేయవలెను. వివాహము సమంత్రకము) పురుషుడుపనయన మగుటతోడనే గురుకులమునకుబోయి యగ్ని కార్యముచేసికొనుచుండును. అట్లే వివాహమయినస్త్రీ భర్తృసేవచేయుచు గృహకృత్యములను చేసికొనుచుండును.

"పతిసేవాగు రౌవాసోగృహార్థోగ్ని పరిక్రియా"

(మను. 2-67)

(పతిసేవయే గురుకులవాసము. గృహకృత్యమే యగ్ని కార్యము)

స్త్రీ కుపనయనము లేదు. గావున సాధారణముగ నీమే యనుపనీతునివలె హోమాదులుచేయుట కనర్హురాలు.