పుట:Womeninthesmrtis026349mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

స్మృతికాలపుస్త్రీలు

నచ్చటచ్చట నీపత్నీ సన్నహనము జరుగుటను "వేదకాలపు స్త్రీలు" అను గ్రంథమున చూచియున్నాము. ఈమంత్రములను జదువనవసరము లేనపుడు గూడ పత్ని, పతితోపాటు కర్మ నొనర్చుచున్నట్లే యెంచవలెను. అంతేకాక పుణ్యకర్మ ఫలము నామెయు భర్తతో పాటు పొందుచున్నది.

"తథాపుణ్య ఫలేషుచ"

(ఆ.ధ. 2-14-18)

(పాణిగ్రహణమువలన భార్యకు కర్మల యందువలెనే కర్మఫలములయందు గూడ సహత్వము గల్గుచున్నది,)

పురుషున కుపనయనమగుటతోడనే యెట్లు కర్మాధికారము గల్గుచున్నదో యట్లే స్త్రీకిని వివాహమగుటతోడనే కర్మలో భర్తృసహత్వము గల్గుచున్నది. పురుషుడుపనయనమునకు పూర్వము కర్మచేయుట కనర్హుడేకాని యాతడు పుట్టినది మొదలు జాతకర్మాది సంస్కారములకు లోనుగావలసియున్నాడు. ఈకర్మలన్నియు స్త్రీ శిశువునకుగూడ జరుగవలసినవే. కాని యవియన్నియు నమంత్రకముగ జరుగును.

    "అమంత్రికా తుకార్యేయం స్త్రీణామావృదశేషత:
     సంస్కారార్థం శరీరన్య యధా కాలం యథాక్రమం"
(మను 2-66)

(జాతకర్మాది కర్మకలాప మంతయు స్త్రీకి సకాలములో సక్రమముగ జరుగవలెను.)