పుట:Womeninthesmrtis026349mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

సప్తమాధ్యాయము.

కర్మ కాండ

కర్మకాండలో స్త్రీ పురుషులకు గల భేదము ముఖ్యముగ నుపనయనముమీద నాధారపడి యున్నది. ఉపనయనము వేదపఠనాధికార మిచ్చుచున్నది. అట్టి యుపనయనము స్త్రీకి లేనేలేదు. కావున వేదమంత్రములతో చేయవలసిన యనేక కర్మలు చేయుటకు స్త్రీ కర్హతయే లేకపోవుచున్నది. కాని

'పాణిగ్రహణాద్ధి సహత్వం సర్వకర్మసు,

(ఆ.ధ.2-14-17)

(పాణిగ్రహణమువలన స్త్రీకి కర్మలలో పురుషునితో సహత్వము కల్గుచున్నది.)

అని చెప్పుటచేత పురుషుడే కర్మ చేసినను దానిని భార్యకూడ చేయుచున్నట్లే యర్థము. ఆమెకొన్ని కర్మలలో పాల్గొనవలసికూడ నుండును. అంతేకాదు, కొన్నిటిలో నామె వేదమంత్రములనుగూడ నుచ్చరింపవలసి యుండును. ఉపనయనములేని యామెకు వేదపఠనాధికారములేదు కాన తాత్కాలిక పఠనాధికారము గల్గుటకై పత్నీసన్నహనమను క్రియ చేయబడును. శ్రౌతకర్మలలో