పుట:Womeninthesmrtis026349mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

స్మృతికాలపుస్త్రీలు

నపిమ్మట గూడ కలియుచుండు నియుక్త స్త్రీపురుషులకు కోడలిని గురుభార్యను పొందినదోషముతో సమానమయిన దోషము గల్గుననియు వారు పతితులగుదురురనియు చెప్పబడియున్నది.

    'నియుక్తౌయౌవిధిం హిత్వావర్తే యాతాంతుకామతః
     తావుభౌ పతితౌ న్యాతాం స్నుషాగ గురుతల్పగౌ'
(మను 9-63)

యోగకాలము పూర్తియగుటతోడనే గురువువలెను కోడలివలెను వర్తింపవలెను. కాని కామభావములతో నుండరాదు.

    'విధవాయాం నియోగార్థే నిర్వృత్తేతు యథావిధి
     గురువచ్చ స్నుషావచ్చ వర్తేయాతాం పరస్పరం'
(మను. 9-62)

ఇట్లు నియోగ విధానము నంగీకరించిన మనుస్మృతి వెనువెంటనే యీక్రింది విధముగ చెప్పుచున్నది.

    "అయంద్విజైర్హి విద్వద్భిః వశుధర్మో విగర్హితః
    మనుష్యాణా మపిప్రోక్తో వేనేరాజ్యం ప్రశాసతి
    సమహీ మఖిలాం భుంజన్రాజర్షి ప్రవరః పురా
    వర్ణానాం సంకరం చక్రే కామోపహతచేతనః
    తతఃప్రభృతి యోమోహాత్ ప్రమీతపతికాం స్త్రియం
    నియోజయత్యపత్యార్థం తం విగర్హన్తి సాధవః"
(మను 9-66, 67. 68)