పుట:Womeninthesmrtis026349mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

117

(వేనుడు రాజ్యపాలనము చేయుచుండగా నీ నియోగము సామాన్య మానవులకుగూడ, ననగా ధర్మైక దృక్కులుకానివారికి గూడ, చెప్పబడినదై తత్ఫలితముగ వశుధర్మముగ గర్హింపబడినది. ఏలన; భూమండలము నంతను పాలించుచుండిన యా రాజు కామబుద్ధికలవాడై నియోగము మూలమున వర్ణ సంకరము చేసెను. అది మొదలు వితంతువును సంతానముకొఱక జ్ఞానముచే నియోగము చేయువానిని సాధువులు నిందించుచున్నారు.)

ఎంతో ధార్మిక భావముతో నెన్నో నియమములతో నింద్రియ జయముకలవారిచేతనే జరుపుటకు వీలయిన నియోగవిధానము వేనుని పాలనకాలమున తగనివిధముగ నాచరింపబడినదై, వర్ణనంకరమునకు కారణమయినదనియు, నాటినుండియు నట్లజ్ఞానముచే చేయబడు నియోగము గర్హింపబడు చున్నదనియు వీనిలో నేదయిన నొకటి సక్రమముగ జరిగినను నదికూడ సహజముగ దుర్వినియోగము చేయబడిన నియోగములలోనే చేర్పబడు చున్నదనియు పైశ్లోకాల తాత్పర్యము.

కావుననే కాబోలు పురాణములలో కలియుగములో నియోగము చేయకూడదని చెప్పబడినది.

    'అశ్వాలంభం గవాలంభం సన్యాసం పలపైతృకం
    దేవారాచ్చసుతోత్పత్తిః కలౌపంచ వివర్జయేత్‌'