పుట:Womeninthesmrtis026349mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

115

మఱదితోనే కాని నియోగము పనికిరాదని కొందఱి మతము.

నాదేవరాదిత్యేకే.

(గౌ. 28-7)

దేవరుడు లేనిచో నీ క్రిందివారు క్రమముగ నియోగమున కర్హులు: సపిండులు, సగోత్రులు, సమానర్హులు గలవారు, సమానవర్ణులు.

పిండగోత్ర సంబంధేభ్యోయోనిమాత్రాద్వా.

(గౌ. 28-6)

నియోగమువలన నొకపుత్రుని కనుటకే యధికారమున్నట్లు పైనచూచియున్నాము>

మనువుకూడ నొకపుత్రునికంటె నెక్కుడుపుత్రులను కనరాదని చెప్పుచు కొందఱి మతములో రెండవపుత్రుడు కూడ గల్గువఱకు నియోగముండు ననుచున్నాడు.

ఏకముత్పాదయేత్పుత్రం ద్వితీయం నకధంచన.
(మను 9-60)

ద్వితీయమేకే వ్రజనం మన్యంతే స్త్రీషుతద్విదః
అనిర్వృతం నియోగార్థం వశ్యన్తోధర్మతస్తయోః
(మను. 9-61)

నియోగము సంతానప్రాప్తికొఱకే యేర్పడిన సంస్థయగుటచే నందు కామమునకు తావులేదు. ఒక పుత్రుడు కల్గి