పుట:Womeninthesmrtis026349mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

101

స్త్రీ పునర్విహమును నిషేధించు వాక్యములు స్మృతులలో నెన్నియో కలవు.

    యస్మైదద్యాత్పితాత్వేనాం భ్రాతావానుమతేపితుః
    తంశుశ్రూషేతజీవంతం సంస్థితంచనలంఘయేత్.
(మను 3-151)

(తండ్రికాని తండ్రియనుమతితో సోదరుడుకాని కన్య నెవనికిత్తురో యాతడు జీవించియున్నపుడును చనిపోయినపిమ్మటనుగూడ నామె యాతని నతిక్రమింపరాదు.)

దీనిం బట్టి దాంపత్యము మరణానన్తరమున గూడ నుండునని తెలియుచున్నది.

    పాణిగ్రాహస్యసాధ్వీ స్త్రీ జీవతోనామృతస్యవా
    పతిలోకమభీప్సంతీనా చరేత్కించిదప్రియం.
(మను. 5-156)

(సాధ్వియైన స్త్రీ భర్తజీవించియున్నను మృతిచెందినను భర్త లోకమునే కోరుచు భర్తకేమియు నప్రియము చేయరాదు.)

స్త్రీ జీవించియుండుటే భర్తకొఱకనియు నాతడు చనిపోయినపిమ్మట నామె జీవించియుండుట వ్యర్థమనియు స్మృతులయభిప్రాయము. భర్తతో ప్రాణత్యాగముచేయుట మిక్కిలి ప్రశంసింపబడినది.