పుట:Womeninthesmrtis026349mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

99

(భార్యయుండగ మఱల వివాహమాడువాడు తన ద్వితీయవివాహవ్యయముతో సమమగు ధనమును మొదటిభార్య కీయవలెను. ఆమె కిదివఱలో కొంత ధనమిచ్చియున్నచో దానిని తగ్గించి యీయవలెను.)

ఆర్థికవిషయములోనే కాక ధార్మికవిషయములో గూడ కొంతభేదమున్నది. ఒకస్త్రీకి పుత్రులు లేకున్నను నామె సవతులలో నెవరికైనను పుత్రులుండుచో నామెయు పుత్రవంతురాలే యనదగును.

    సర్వాసామేకపత్నీ నామేకాచేత్పుత్రిణీ భవేత్
    నర్వాస్తాస్తేనపుత్రేణ ప్రాహపుత్రవతీర్మనుః
(మను 9-183)

కాని కర్మలన్నిటిలోను సహత్వము నొందుటకు ధర్మపత్ని కే యధికారముగలదు. జ్యేష్ఠభార్యయే ధర్మపత్నియగును. అసవర్ణ స్త్రీలను వివాహమాడునపుడు పాణిగ్రహణము లేదని 'వివాహవిధాన'మను ప్రకరణమున జూచియుంటిమి. మఱియు పాణిగ్రహణమూలమున భార్యకు కర్మసహత్వము సిద్ధించునని కూడ చూచియుంటిమి. కాన సవర్ణస్త్రీలలో జ్యేష్ఠ భార్యకే ధర్మములలో సహకర్తృత్వమని యాజ్ఞవల్క్యుడు చెప్పుచున్నాడు.

సవర్ణాసువిధౌధర్మే జ్యేష్ఠయానవినేతరా.

(యాజ్ఞ.1-89)