పుట:Womeninthesmrtis026349mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

స్మృతికాలపుస్త్రీలు

పైన తెల్పబడిన దోషములలో నేదోషమును లేని భార్యయుండగా మఱొకభార్యను వివాహమాడుట చాలదోషము. అట్లు వివాహమాడువాడు పూర్వాధ్యాయములో తెల్పబడినట్లు గాడిదచర్మమును కప్పుకొని భిక్షనెత్తికొనవలెను. అట్లు పునర్వివాహము చేసికొన్నను దానివలన నేధార్మికప్రయోజనమును నుండదు. పురుషునకు దానివలన రతిమాత్ర ప్రయోజనమే కల్గును.

    ప్రథమాధర్మపత్నీ చద్వితీయారతివర్తినీ
    దృష్టమేవఫలంతత్ర నాదృష్టమువయాయతే.
(దక్ష. 4-15)

మఱొకభార్యను జేసికొనినను గూడ మొదటిభార్య భార్యగనే యుండును. ఆమెను పోషింపవలసిన బాధ్యతకూడ భర్తపై కలదు.

అధివిన్నాతుభర్తవ్యా మహదేనోన్యధాభవేత్.

(యాజ్ఞ. 2-75)

(అధివిన్నను భరింపవలెను. లేనిచో గొప్పపాపము వచ్చును.)

అకారణముగ రెండవభార్యను జేసికొనువాడు మొదటి భార్యకు కొంతధనమును కూడ నిచ్చుకొనవలెను.

    అథివిన్నః స్త్రి యైదద్యాదాధివేదని కంసమం
    నదత్తం స్త్రీధనంయస్యై దత్తేత్వర్థంప్రకల్పయేత్.
(యాజ్ఞ. 1-146)