పుట:Womeninthesmrtis026349mbp.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

97

పైన పేర్కొనబడిన భార్యలవలన ధర్మప్రజాసంపత్తి గల్గుటలేదు కావుననే వా రున్నను భర్తకు పునర్విహాధి కారము గల్గుచున్నది. పుత్రులను గల్గి ధర్మకార్యములలో భర్తకు పనికివచ్చు భార్య యుండగ మాత్రము పురుషుడు మఱొకతెను వివాహ మాడరాదు.

ధర్మప్రజా సంపన్నే దారే నాన్యాం కుర్వీత.

(ఆపస్తంబ.ధ.సూ.2-11-!2)

(ధర్మయుక్తయు ప్రజాయుక్తయు నగు భార్య యుండగా మఱొక భార్యను జేసికొనరాదు.)

ధర్మము, ప్రజయు కూడ లేని భార్య యున్నను మఱొక భార్యను వివాహ మాడవచ్చునని దీనివలన తేలుచున్నది. ఈ రెంటిలో నొకటి యుండి మఱొకటి లేకున్నను గూడ పునర్వివాహమునకు వీలున్నట్లు గూడ దీనివలన తెలియుచున్నది. కాని యగ్న్యాధానమైన పిమ్మట నట్లు పునర్వివాహము చేసికొనరాదని యాపస్తంబుడు చెప్పుచున్నాడు.

అన్యతరాభావే కార్యాప్రాగగ్న్యాధేయాత్,

(ఆ.ధ.సూ. 2-11-12)

(బార్యకు ధర్మ, ప్రజలలోనే యొకటి లేకపోయినను నగ్న్యాధానమునకు పూర్వమైనచో మఱొకవివాహము చేసికొనవచ్చును)