పుట:Womeninthesmrtis026349mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

స్మృతికాలపుస్త్రీలు

యాతనియొక్కయు నాతని పితరులయొక్కయు స్వర్గప్రాప్తికి హేతు వగుచున్నది.

    అపత్యం ధర్మకార్యాణి శుశ్రూ షారతిరుత్తమా
    దారాధీనస్తథా స్వర్గః పితౄణా మాత్మనశ్చహ
(మను 9-28)

(సంతానము, ధర్మకార్యములు, సేవ, యుత్తమసుఖము, తనకును తన పితరులకును సుఖము, ఇవి యన్నియు భార్య యధీనములే యై యున్నవి.)

కావుననే యిదివఱలో తెల్పినట్లు మానవునకు వివాహ మవశ్యకర్తవ్య మైనది. యావజ్జీవము జితేంద్రియుడుగనే యుండు పురుషుడు మాత్రము వివాహ మాడకుండినను దోషము లేదని కొందఱి మతము. అట్లుండగోరువాడు స్నాతకుడైన పిమ్మట వివాహ మాడుటకు బదులు నైష్ఠికబ్రహ్మచర్యమున ప్రవేశించును.

తస్యాశ్రమ వికల్ప మేకే బ్రువతే

(గౌ.ధ.సూ. 3-1)

(వాని కాశ్రమవికల్పమును గొందఱు చెప్పుచున్నారు.)

కావున సాధారణముగ దాంపత్యజీవిత మందఱకు నవశ్యమే యగుచున్నది. ఈ జీవితములో భార్యాభర్తలు శారీరకముగ పృథగ్వ్యక్తులే యై యున్నను సమస్త విషయములలోను నవినాభావమును నిర్విశేషమును నగు జీవయా