పుట:Womeninthesmrtis026349mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

91

(భర్త భార్యలో ప్రవేశించి గర్భమై జనించుచున్నాడు. భర్త యామెయందు జనించుచున్నాడు కావుననే భార్యకు జాయ యని పేరు.)

     స్వాం వ్రసూతిం చరిత్రం కులమాత్మాన మేవచ
     స్వంచ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్హిరక్షతి
(మను 9-7)

(భార్యను రక్షించుకొనువాడు తన జన్మను, చరిత్రను, కులమును, తనను, తన ధర్మమును రక్షించుకొనుచున్నాడు.)

పురుషుడు తానే భార్యనుండి పుట్టుచున్నాడని పైన తెల్పబడినది. అనగా మానవుడు తన దేహమును వీడినను పుత్రరూపమున జీవించియుండును. కాన పుత్రుడు తండ్రికి నమృతత్వము నిచ్చినవా డగుచున్నాడు. పితరుల ఋణమును గూడ దీర్పించుచున్నాడు.

    ఋణమస్మిస్సన్న యత్యమృతత్వం వచగచ్ఛతి
    పితాపుత్రస్య జాతస్య పశ్యేచ్చ జీవతోముఖం
(వసిష్ఠ 17-1)

(సజీవుడై జనించిన పుత్రుని ముఖము జూచిన తండ్రి తన పితౄఋణమును తీర్చివైచి దానిని కుమారునియందర్పించుచున్నాడు. మఱియు నమృతత్వము నొందుచున్నాడు.)

పై యంశముల నన్నిటిని జూడగా పురుషుని సమస్తసుఖములును భార్య యధీనములే యై యున్నవని తెలియగలదు. ఆమె యాతని కనేకములగు లౌకికసుఖముల నిచ్చుటయేకాక