పుట:Womeninthesmrtis026349mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

93

త్రానుభవము గలవారై యుందురనియు, నీ యనుబంధమైహికము మాత్రమే కాదనియు, నీ సంబంధములో పురుషు డధికారి యనియు ప్రథానాంశములు ఇట్టి దాంపత్యము ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు పురుషునకు మనుమలును, తల నెఱపును, ముడతలును గలుగువఱకు నడుపబడవలెను. అనంతరము పురుషుడు వానప్రస్థాశ్రమములో ప్రవేశించును. వనమునకు బయలుదేరునపుడు భార్యను కుమారునియొద్ద నుంచి వెళ్ళవచ్చును, లేదా వనమునకు తీసికొనిపోవచ్చును.

పుత్రేషు దారాన్నిక్షిప్యవనం గచ్ఛేత్స హైనవా

(మను 6-3)

(భార్యను పుత్రునొద్ద నుంచి కాని కూడ తీసికొనిగాని వనమునకు బోవలెను>)

భార్యను తీసికొని పోయినను బ్రహ్మచర్యము నవలంబించియే యుండవలెను.

బ్రహ్మచారీ ధరాశయ:

(మను 6-26)

(వానప్రస్థుడు బ్రహ్మచారియై నేలపై పరుండవలెను.)

వానప్రస్థునకు భార్యతో నవశ్య మాచరింపవలసిన కర్మయేదియు లేదు. కావున వనప్రవేశముతో దాంపత్యజీవితము ముగియు చున్నది.

__________