పుట:Womeninthesmrtis026349mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరాశర స్మృతిలో గూడ కొందఱు స్మృతి కారులు పేర్కొనబడి యున్నారు.

     శ్రుతామే మానవాధర్మా వాసిష్ఠా: కాశ్యపా స్తథా
     గార్జీయా గౌతమీయాశ్చతథా చొఎశనసా:శ్రుతా:
     అత్రేర్విష్ణోశ్చ సంవర్తాద్దక్షా దంగిరన స్తథా
     శాతాతపాచ్చహారీతా ద్యాజ్ఞవల్క్యాత్తదైవచ
     కాత్యాయన కృతాశ్చైపతథా ప్రాచేతసాన్మునే: [పరాశర. 1-13, 14, 15]

ఇట్లు పరాశరయాజ్ఞ వల్క్యులచే పేర్కొన బడిన స్మృతికారుల సంఖ్య యిఱువదిరెండని తేలుచున్నది; (1) మనువు (2) అత్రి (3) విష్ణువు (4) హారితుడు (5) యాజ్ఞవల్కుడు (6) ఉశనుడు (7) ప్రాచేతనుడు (8) యముడు (9) అపస్తంబుడు (10) అంగిరసుడు (11) సంపర్తుడు (12) కాత్యాయనుడు (13) బృహస్పతి (14) పరాశరుడు (15) శంఖుడు (16) లిఖితుడు (17) దక్షుడు (18) గౌతముడు (19) శాతాతవుడు (20) వసిష్ఠుడు (21) కశ్యపుడు (220 గర్గుడు.

వీరుకాక యీక్రిందివారుకూడ స్మృతికర్తలుగ నితర గ్రంథములలో నుదాహరింపబడి యున్నారు; (23) వృద్ధపరాశరుడు (24) దేవలుడు (25) బుధుడు (26) పులస్త్యుడు (27) నారదుడు (28) బోధాయనుడు.