పుట:Womeninthesmrtis026349mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

85

షుని యాధిక్యహేతువుచే భార్యయే యట్లు మారుట మంచిది. ఆదర్శాశయప్రకృతులలో భార్యను భర్తతో సమన్వయింప జేయుటకై బోధాయనగృహ్యసూత్రములో నొక ప్రక్రియ గలదు.

అథాస్యా ఉపోత్థాయదక్షిణేన హస్తేన దక్షిణమం సంప్రతిబాహుమన్వవహృత్య హృదయదేశమభిమృశతి 'మమహృద యేహృదయంతే అస్తు. మమచిత్తే చిత్తమస్తు. మమ వాచమేకమానాశ్శ్రుణు. మామేవాను వ్రతాసహచర్యామయాభవ' ఇతి అథాస్యైదక్షిణే కర్ణేజపతి. మాంతేమనః ప్రవిశతు మాంచక్షుర్మాముపేతుభగః మయిసర్వాణి భూతానిమయి ప్రజ్ఞానమస్తుతే.

(బో.గృ.సూ.1-4)

(వరుడు కుడిచేతితో వధువుయొక్క దక్షిణాంసమును గూర్చి బాహువునెత్తి హృదయదేశమును స్పృశించి యిట్లు చెప్పుచున్నాడు. 'నాహృదయమందు నీ హృదయముండుగాక! నాచిత్తమందు నీచిత్తముండుగాక! నావాక్కు నేకమనస్కవై వినుము. నన్ననుసరించియే వ్రతముగలదానవగుము. నాతో సహచర్యవగుము.' ఆమె కుడిచెవిలో నిట్లు జపించుచున్నాడు. 'నీమనస్సు నన్ను ప్రవేశించుగాక! నీ నేత్రము, భగము నన్ను ప్రవేశించుగాక! నీకు నాయందే సర్వభూతములు గన్పట్టుగాక! నాయందే నీకు ప్రజ్ఞానముండు గాక!')