పుట:Womeninthesmrtis026349mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

స్మృతికాలపుస్త్రీలు

శారీరకముగ రెండువ్యక్తులైన స్త్రీ పురుషులు మానసికముగ నొకే వ్యక్తి యగుటయే దాంపత్య ప్రధాన లక్షణమని పైన జెప్పబడిన యంశమువలన దేలుచున్నది. భర్త శాసకుడగుటచే నాతని ననుసరించి భార్య మారుట యెక్కుడు సహజము.

    యాదృగ్గుణేన భర్త్రాస్త్రీ సంయుజ్యేతయథావిధి
    తాదృగ్గుణాసా భవతి నమ ద్రేణేవ నిమ్నగా
(మను 9-22)

(నది సముద్రముతో గలసి సముద్రోదకరుచినే పొందినట్లు స్త్రీ యెట్టిగుణములుగల భర్తతో గూడిననట్టి గుణములు గలదే యగును.)

కాన నీచజన్మగల స్త్రీ యుత్కృష్టపురుషుని వివాహమాడుచో నామెయు నుత్కృష్టత నొందును.

     అక్షమాలావసిష్ఠేన సంయుక్తాధమయోనిజా
     సారంగీమందపాలేన జగామాభ్యర్హణీయతాం
     ఏతాశ్చాన్యాశ్చలోకే స్మిన్నవకృష్ట ప్రనూతయః
     ఉత్కర్షంయోషితః ప్రాప్తాః స్వైర్భర్తృగుణైః శ్శుభైః
(మను 9-23, 24)

(అధమయోనిజ యగు నక్షమాల వసిష్ఠునితోను, సారంగిమందపాలునితోను కూడి గౌరవము నొందిరి. వీరును నితర నీచకులజలగు స్త్రీలును వారివారి భర్తల సుగుణములచే ఘనతను పొందిరి.)