పుట:Womeninthesmrtis026349mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

స్మృతికాలపుస్త్రీలు

ప్రతికూలురాలైన భార్య కలవానికి నరకమిచ్చటనే కలదు. ఇట్టి యనురాగము స్వర్గములో గూడ నుండదు.)

భార్య యనుకూలురాలు కానిచో నామె నట్లు చేయవలసిన భాధ్యతకూడ భర్తపైననే కలదు. సకాలములో నామె నాతడు బాగుచేయనిచో నామె శాశ్వతముగ చెడిపోవును.

అవశ్యాసాభవేత్పశ్చాత్ యథావ్యాధిరువేక్షితః

(దక్ష 4-8)

అట్టి భార్యను జక్కచేయుటకై యామెను కొట్టుట యవసరమగుచో నట్లు చేయవచ్చునని లిఖితస్మృతి చెప్పుచున్నది.

    లాలనీయా సదాభార్యా తాడనీయా తథైవచ
    లాలితా తాడితాచైవ స్త్రీ శ్రీర్భవతినాన్యథా
(లిఖిత 4-16)

(భార్యను లాలనజేయుట యెట్లు కర్తవ్యమో యవసరమగుచో శిక్షించుటకూడ నట్లే కర్తవ్యము. అందువలన స్త్రీ శ్రీ యగుచున్నది.)

భిన్నాశయాదర్శప్రకృతులుండుచో దంపతులలోన ననుకూలత ప్రవేశించును. ఎవరో యొకరు మఱొకరి మార్గమున బడుచో నా యననుకూలత నశించును. ఇరువురును గూడ నట్లు చేయుటకు యత్నింపవలసినదే కాని పైన వివరింపబడిన పురు