పుట:Womeninthesmrtis026349mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

83

(భర్తతోభార్యయు భార్యతోభర్తయు సంతుష్టులైన కులములో మంగళము నిత్యముగనుండును. స్త్రీ తృప్తురాలుకానిచో పురుషుడు సంతుష్టుడుకాడు. పురుషుడు సంతుష్టుడు కానిచో సంతతియే కలుగదు. స్త్రీ సుఖముగనుండుచో కులమెల్లయు ప్రకాశించును. స్త్రీ సుఖముగా నుండనిచో కులము కూడ ప్రకాశింపదు.)

కావున భర్త ఋతుకాలగమనమాత్రముననే కాక యితరమార్గములచే కూడ భార్యను సంతోష పెట్టవలెను.

    అనృతావృతుకాలే చమంత్రసంస్కారకృత్పతిః
    సుఖస్యనిత్యందాతేహ పరలోకే చయోషితః
(మను 5-153)

ఈవిధముగ నన్యోన్యప్రేమతో నుండు దాంపత్యము దక్షస్మృతిలో(4- 3,4,5) నిట్లు కీర్తింపబడినది.

     అనుకూలాన వాగ్దుష్టా దక్షాసాధ్వీప్రియంవదా
     ఆత్మగుప్తాస్వామిభక్తా దేవతాసానమానుషీ
     అనుకూలకళత్రీయ స్తస్యస్వర్గ ఇహైవహి
     ప్రతికూలకళత్రన్య నరకోనాత్రసంశయః
     స్వర్గేపి దుర్లభంహ్యేత దనురాగః పరస్పరం

(అనుకూల, ప్రియభాషిణి, కుశల, సాధ్వి, గుట్టుకలది, పతిభక్తికలదియగు స్త్రీ దేవతయే కాని మానుషికాదు. అనుకూలురాలైన భార్య కలవానికి స్వర్గమిచ్చటనే కలదు.