పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

స్వీయ చరిత్రము.

గాని నిజమయిన సంస్కారముజరగదు. కులమువారికిఁగాని జగుద్గురులమనియు ధర్మస్థాపన కర్తలమనియుఁ జెప్పుకొనెడు పీఠాధిపతులకుఁగాని యంతటిమగ తనము లేదు. రజస్వల లయినతరువాతనే బాలికలకు వివాహములు చేయుట నిజమయిన సంస్కారమును పరులకు మార్గప్రదర్శకము నగును. అప్పుడది చిన్న సంస్కారము గాక పెద్దసంస్కారమేయగును. నాపుత్రికకు రజస్వల యయయినతరువాతనే వివాహము చేయుచున్నాని చెప్పి చేయువానిని సహించి యూరకుండక కులమువారు కులమునుండి వెలివేయుదురు. నామిత్రులైన బసవరాజు గవర్రాజుగారు తమకూఁతునకు పదునాఱేండ్లు నిండుటకుముందు పరిణయము చేయనని పలుకుచుండెడివారు గాని తమప్రతిజ్ఞను నెఱపి యితరులకు దారిచూపుటకు వారి కాయువు లేకపోయినది. ఆయనయే తగినంతకాలము జీవించియుండుట తటస్థించియుండినపక్షమున, చెప్పినంతపనియు తప్పక చేసితీఱెడువాఁడు. జాతినుండి బహిష్కారముండదుగనుక, శాఖాభేదములేక యొక్కొక్కవర్ణములోనివా రొండొరులతో వివాహసంబంధములు చేసికొనునట్లు చేయుదమన్నను, మాకదియు ససాధ్యముగానే కనఁబడెను. అట్లు చేయుట కర్తవ్యమని యెల్లవారును జెప్పువారేకాని చేయ సాహసించువారు కానరాలేదు. చేసెదమనువారున్నప్పుడు చేసికొనెడువారు దొరకలేదు; చేసికొనెద మనువా రున్నప్పుడు చేసెడివారు దొరకలేదు ; ఉభయులును దొరకినప్పుడు కార్యము కాలేదు. నామిత్రుఁడును నియోగియునైన యొక సంస్కారప్రియుఁడు తనకొమారితలలో నొకతెను పాఠశాలలో విద్యాభ్యాసము చేయుచున్న యొకవైదికబాలున కిచ్చెదనని చెప్పెను; చదువునందు తెలివిగలవాఁడును బుద్ధిమంతుఁడు నైనయాబాలకునితండ్రియు తా నాచిన్న దానిని తనకుమారునకు చేసికొనెదమని చెప్పెను. ఇట్లు మాటలలో కొంతకాలము గడచినతరువాత నామిత్రుఁడు స్వశాఖబాలున కిచ్చియే యాచిన్న దానికి వివాహము చేసెను. ఇది యేమని యడుగఁగా నతఁ డన్యశాఖవరున కిచ్చుట తన కిష్టమే యైనను తనభార్య కిష్టము లేకపోవుటచేత స్వశాఖవానికే యియ్యవలసి