ఈ పుట ఆమోదించబడ్డది
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే.
ప్రభువు అనే జీవుడు కర్మను, కర్మఫలము, వీనిలో
దేనిని సృజింపడు. ప్రకృతిస్వభావము చేతనే యంతయును
నడచును. 5-14
నాదత్తే కశ్యచి త్పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనా౽వృతం జ్ఞానం తేన ముహ్యంతిజంతవః.
జ్ఞానమనునది అజ్ఞానముచే చుట్టబడియుండినందున
జీవులు మోహమునొందుదురు. ప్రకాశమునొందిన యాత్మ
యేదైన చెడుపనినిగాని మంచిదనబడుదానినిగాని యంటి
యుండదు. 5-15
ఆనాదిత్వా న్నిర్గుణత్వాత్ పరమాత్మా౽య మవ్యయః
శరీరస్థో౽పి కౌన్తేయ నకరోతి నలిప్యతే.
ఆదియనునదిలేక, గుణమునులేక, యిట్లు మార్పులేక
పరమాత్మ దేహమందున్నను అది యేపనిని చేయకయు, పని
నంటకయు నుండును. 13-32
ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే౽ర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా.
ఎల్లప్రాణులలోను నీశ్వరుడున్నాడు. మాయబలము