పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత నీశ్వరు డెల్లజీవులను చక్రములందు తిరుగు ప్రతిమవలె త్రిప్పును. 18-61


ఈ శ్లోకమువలన నేమితెలిసికొంటిమి? పుట్టినప్పుడు ఏగుణములతో పుట్టితిమో యవి మనలను ప్రేరేపించును. పాపముచేసినాడని యొకనిని ద్వేషింపకూడదు. హేళనయు చేయకూడదు. మనమా పాపమును చేయలేదని గర్వపడను కూడదు.


ఈ శ్లోకములను గ్రహించి మన కెట్టిబాధ్యతయులేదని చెప్పకూడదు. అంతయును పుట్టుగుణమని విడిచి యెట్టిబాధ్యతయు లేక నడచుకొనుటకీశ్లోకములు ప్రమాణమని భావించుట మూఢత్వమగును. ఆత్మశక్తిచే స్వభావగుణములను, అనగా తాను పూర్వజన్మమున చేసినకర్మలఫలముగా సంపాదించిన స్వభావగుణములను వశముచేసికొనవలెను. వాని నడచి గెలిచి విడుదలపొందవలెను. స్వభావగుణములను గూర్చి గీతయందు చెప్పబడిన శ్లోకములెల్ల నితరులను విశ్వాసముతో చూచుటకును తనలో మనస్సున కళవళము నొందక యుండుటకును సాధనముగ సత్యము నెత్తి చూపుటకును తప్ప, నొక్కొక్కడును దనవిషయమున బాధ్యతను తప్పించుకొని ప్రయత్నముచేయక చెడిపోవుటకుగాదు.


ఈ యుపదేశ మితరులను చూచి వీరు పూర్వకర్మము