పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సత్త్వం రజ స్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః
నిబధ్న న్తి మహాబాహో దేహే దేహిన మవ్యయం.


సత్వము, రజస్సు, తమస్సు, ఈ గుణములు ప్రకృతిలో పుట్టును. స్వభావముచేత నాత్మ యవ్యయమైనదైనను దేహమునందు నిలుచునపుడది యీగుణములచే కట్టబడు చున్నది. 14-5


నా న్యం గుణేభ్యః కర్తారం యదా దృష్టా౽ను పశ్యతి
గుణేభ్యశ్చ పరంవేత్తి మద్భావం సో౽ధిగచ్చతి.


గుణములు తప్ప వేరే కర్త లేడను దానికి జీవుడు కనుగొని గుణములకు పైనున్న తత్త్వమును దెలిసిన యెడల నా స్వరూపమును తెలిసినవాడగును. 14-19


న త దస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి స్స్యాత్త్రిభిర్గుణైః.


ప్రకృతియందు కనపడు ఈ మూడుగుణములనుండియు విడబడి నిలుచు ప్రాణి భూలోకమునందు లేదు. ఆకాశము నందును దేవతలయందునుగూడ లేదు. 18-40


స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యన్య వశో౽పి తత్.


స్వబావముగనుండు కర్మములచే కట్టువడియున్న నీవు మోహము వలన దానిని చేయననినను నీవశము కాకయే నీవు దానిని చేయుదువు. 18-60