పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్రేకముపనిచేయును. స్వభావమనునది అందరకును వేదనను కలిగించును. అది కార్యరూపమున బయలుబడును. దీనినొకని యందు చూచి మనము కోపింపవచ్చునా? ఇతరుల పనిని చూచి వేసరపడునప్పుడెల్ల వారువారు తమలోని లోపములను జ్ఞాపమునకు తెచ్చుకొనవలెను. నీమనస్సు శుద్ధముగ నున్నదా? ఇతరులకు దెలియునట్లది బయటికి కనబడకపోయినను అది లోపలనే చేయుపనిని నీవు చూచుచునే యుందువు గదా. దానిని నీవడచినయెడల అది నీభాగ్యము. ఇతరులా భాగ్యమును బొందకయుండుటను నీవు విచారపడవలయును. భగవదనుగ్రహమును సంపాదించినయెడల గదా వారి యాత్మ అస్వాభావికమయిన కర్మమునుండి బయట బడగలదు. లోకమున నడచునదంతయు నీశ్వరసంకల్పము. ఏది చెడుగు, ఏది మంచి యని నీవు తీర్మానింప వచ్చునా? తుద కేదిచెడుగు, ఏదిమంచి, అనునదీశ్వరునికే తెలియును. జగత్తు విధానమును తెలియని మనము దానిని తీర్మానింప వీలులేదు.


ప్రకృత్యైవ చకర్మాణి క్రియమాణాని సర్వశః
యఃపశ్యతి తథా౽త్మానా మకర్తారం సపశ్యతి.


ఏవిధమునను పనులు ప్రకృతివలననే చేయబడుచుండును. కావున నాత్మయనునది కర్తకాదని కనుగొన్నవాడే తత్త్వమును దెలిసినవాడు. 13-30