పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేహముతో గూడివచ్చు ప్రకృతిగుణములు. దానితోకలిసియే యుండును. జ్ఞానమునొందినపిదపను ఈ చాంచల్యముండును. దానినిగని దుఃఖింప పనిలేదు. అది స్వభావమని తెలిసి, యడుగడుగునకు నిజతత్త్వమును స్మరించి శాంతిని విడువక కాచుకొనవలెను. గుణములను దాటినవా రెవరన:-


ప్రకాశంచ ప్రవృత్తించ మోహ మేవ చ పాండవ
నద్వేష్టి సంప్రవృత్తానిన నివృత్తాని కాంక్షతి.


మనఃప్రకాశము, పనులను చేయవలెను ఆసక్తి, మోహము, ఇవిప్రాప్తించినప్పుడు వీనిని చూచి భయపడక, యాస్థితులు తొలగగనే వానిని కోరకయుండువాడు. 14-22


ఉదాసీనవ దాసినో గుణైర్యో నవిచాల్య తే
గుణా వర్తన్త ఇత్యేవ యో౽ వతిష్టతి నేంగతే.


స్వీయ స్వభావగుణములచేత మనస్సు కలతనొందక యుదాసీనముగా నుండి, 'గుణములు వర్తించుచున్నవి' అని తలచి, యాశను విడిచి నిలుచువాడు. 14-23


సమదుఃఖ సుఖస్స్వస్థ స్సమలోష్టాశ్మ కాంచనః
తుల్యప్రియాప్రియోధీర స్తుల్యనిందాత్మసంస్తుతిః.


దుఃఖమును సుఖమును సమముగా గొని, యాత్మ యందు నిలుచువాడు, మంటిబెడ్డనురాతిని బంగారమును సమముగా చూచువాడు, ప్రియము చేయువారియెడలను నప్రియ