పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

81

కార్యముల యారంభమునందును ఫలాశనువిడిచి, నాయెడ భక్తిగలవాడే నా కిష్టుడు. 12-16


యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మేప్రియః.


ఎక్కువ సంతోషము నొందక, పగ బూనక, దుఃఖింపక, ఆశగొనక, మేలును, కీడునుగూడ విడిచి, భక్తిగలవాడే నాకిష్టుడు. 12-17


సమ శ్శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః
శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్సంగవివర్జితః.
తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్
అని కేత స్థ్సిరమతిర్ భక్తిమాన్ మేప్రియో నరః.


పగవానియందును నేస్తగానియందును, మానమునందును అవమానమునందును, చలియందును వేడియందును, సుఖమునందును, దుఃఖమునందును, సమముగా నుండి, సంగమును విడిచి, 12-18


పొగడ్తయు నిందయు సమముగా చూచి మాటాడక, యేమివచ్చినను దానితో సంతోషపడి, తన యిల్లిదియనక, స్థిరబుద్ధితో నుండుభక్తుడు నా కిష్టుడు. 14-19


ఇట్లింద్రియ నిగ్రహమువలనను, నియమములచేతను, ధ్యానముచేతను, పొందిన శాంతినిగూడి పూర్వకర్మఫలముగ