పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణఏవ చ
నిర్మమో నిరహంకార స్సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్ట స్సతతంయోగీ యతత్మా ధృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి ర్యోమద్భక్త స్సమే ప్రియః.


ఏప్రాణియెడలను పగనువిడిచి, స్నేహమును కరుణయు గలవాడయి, నేననియు నాదనియు ఆనక, సుఖమును దుఃఖమును సమముగా చూచి, 12-13


ఎప్పుడును మనస్సంతోషము గలవాడై మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడై, దృఢనిశ్చయము గలవాడై, నాయందే మనస్సును బుద్ధిని అర్పణముచేసిన యోగి నా భక్తుడు నాకిష్టుడు. 12-14


యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతేచ యః
హర్షామర్ష భయోద్వేగై ర్ముక్తో యస్సచ మేప్రియః.


ఎవనికి లోకులు వెరవరో, లోకుల కెవడు వెరవడో, హర్షము, మాత్సర్వము, భయము నను వేగములనుండి యెవడు విడబడియుండునో, వాడే నా కిష్టుడు. 12-15


అనపేక్ష శ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ యోమద్భక్త స్స మేప్రియః.


దేనినైనను కోరి ఫలమునకు యెదురుచూడక, శుచియై, నేర్పరియై, పట్టుదలలేనివాడై, కలతను విడిచినవాడై, ఎల్ల