పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రియములను మనస్సును బుద్ధిని కట్టి, మోక్షము నలవాటుగా లక్ష్యమందుంచుకొని, ఆశ, భయము, క్రోధము వీనిని విడిచిన ముని ముక్తుడే యగును. 5-28


ఏకార్యము చేసినను దానిని స్వార్థములేక చేయుటను బాగుగ నభ్యసించి దానినే స్వభావముగ చేసికొనినయెడల పిదప మనస్సు పక్వమగును. ఆపై కర్మములేఫలము నిచ్చినను శాంతి చెడక నిలుచుటకుశక్తియుండును. ఆశను, ఆసక్తిని విడిచిన గాని యిది కుదురదు. నిజమైన సుఖ మంతరాత్మ యందుండు సుఖమే. ఇంద్రియములవలన కలుగు సుఖ భోగము లాత్మసుఖమును తేచాలవని బాగుగ గ్రహింప వలెను.


ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే.


యోగమార్గమున పైకి పోగోరుమునికి కర్మమే సాధన మని చెప్పబడినది. యోగమార్గమున పై కెక్కిన పిదప దాని వలన కలుగు శాంతము వానికి సాధనమగునని చెప్పబడినది. 6-3


యదా హి చేంద్రియార్థేషు నకర్మ స్వనుషజ్జతే
సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే.


ఒక డెల్లసంకల్పములను విడిచి యింద్రియ విషయము లందును, కర్మములందును, ఆసక్తి లేనివాడై యుండుటచేతనే