పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు యోగమార్గమున పై కెక్కినవా డనబడును. 6-4


ఉద్థరే దాత్మనా౽౽త్మానంనా౽త్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రివురాత్మనః.


తనయాత్మచేత తన్నుద్ధరించుకొనవలెను. ఆత్మను చెరుచుకొనగూడదు. తనకు తనయాత్మయే బంధువు. అత్మయే తనకు పగవాడును అగును. 6-5


బంధురాత్మా౽౽త్మన స్తస్యయేనా౽త్మైవా౽త్మనా జితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతా౽త్మైవ శత్రువత్.


తన్ను తాగెలిచినవానికే తనయాత్మ బంధువగును. తన్ను తాగెలువని వానికి తనయాత్మయే పగవాడై చెరు చును. 6-6


జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః.


తన్ను తాగెలిచి ప్రశాంతి నొందినవాని యుత్తమమైన యాత్మశీతోష్ణములందును, సుఖదుఃఖములందును, మానావ మానములందును సమత్వమును బొంది వెలయును. 6-7


సుఖములందును దుఃఖములందును మనస్సు కలత నొందక సమత్వమును బొందుటకు ధ్యాన మావశ్యకము. కర్మయోగ మభ్యాసము చేయునపుడు అనగా తనకేర్పడ్డ పనులను స్వార్థమును విడిచి కర్మపరిణామమును గూర్చి చింత