పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రోధములచే గలుగు వేగము నెవడు సహింప శక్తుడగునో వాడే యోగి; వాడే సుఖమును పొందతగినవాడు. 5-23


మనస్సున ప్రశాంతి నొందినచో నదియే పరమా నందము. పరమపదమున బొందదగిన సుఖమున కొకవేళ సమమని చెప్పతగినదియు నీలోకములోనే పొందదగినదియు ఈశాంతమే.


యోం౽తస్సుఖోం౽తరారామస్తధాం౽ర్జోతి రేవయః
సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో౽ధిగచ్ఛతి.


బాహ్యవిషయములను తాకక, తనలోనే సుఖము గల వాడై తనలోనే శాంతిని పొందినవాడై, తనలోనే జ్యోతితో గూడినవాడైన యోగి బ్రహ్మపదమును బొంది, బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నాడు. 5-24


కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం.


కామమును క్రోధమును విడిచి, చిత్తమును కట్టుబాటు చేసికొనిన యాత్మజ్ఞానులకు బ్రహ్మనిర్వాణము సమీపముననే యుండును. 5-26


యతేంద్రియ మనోబుద్ధి ర్ముని ర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధో య స్సదా ముక్త యేవ సః.