పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండును; అవి యనిత్యములు. వానిని సహించుకొనుము. 2-14


యం హి నవ్యథయ న్త్యే తే వురుషం వురుషర్ష భ
సమదుఃఖ సుఖంధీరం సో౽మృత త్వాయకల్ప తే.


ఎవడు వీనిచే దుఃఖము నొందక, సుఖమును దుఃఖము నొక్కటిగ తలంచునో, ఆధీరు డమృతత్వమును పొందిన వాడని తలంపవచ్చును. 2-15


సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపమవాప్స్యసి.


సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వీనిని సమముగాగొని యుద్ధమునకు తొడంగుము ఇట్లు కర్మమును చేసినయెడల పాపమును పొందవు. 2-38


యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః.


విషయముల సంగముచే కలుగు సుఖములు, దుఃఖ ములకు కారణములే. ఆసుఖములకు మొదలును తుదియు కలవు. జ్ఞాని వానిలో రమింపడు. 5-22


శక్నో తీహైవ యస్సోఢుం ప్రాక్ఛరీర విమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్ససుఖీనరః.


శరీరమును విడుచుటకు ముందీ లోకములోనే కామ