పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెను, అనగా సుఖము నిచ్చుసందర్భము లేర్పడినను, దుఃఖము నిచ్చుసందర్భములు వచ్చినను మనస్సునకు స్థైర్యము గలుగున ట్లభ్యాసము చేసికొననవలెను. ఒకసుఖము కలుగకముందు దానికొరకు నిరీక్షించుచు మనస్సున పొంగుటయు, కలిగి అంతరించినపిదప దానిని దలచితలచి దుఃఖపడుటయు, ఇదియేసుఖదుఃఖముల రాకపోకల యడతెగని వ్యవహారము. సుఖమును దుఃఖమును నొకదానిని విడిచి మరియొకటి యుండ చాలదు. రెండును జతగనే యొకదానివెనుక రెండవది వచ్చు చుండును. దుఃఖమే లేకుండిన సుఖమే దుఃఖమగును. ఈ సుఖదుఃఖములు రెండును విషయములతోడి సంగమువలన గలుగుటచేత క్షణమాత్రముండి మరుచటిక్షణము పోవు మనోభావములేకాని వేరుకావు. ఇవి యాత్మను తాకజూలవు. బయటినుండి వచ్చు నేసుఖమును దుఃఖమును, నాత్మకొక భాగ్యము నివ్వజాలవు. తనలో జనించు కోరికలే, తాను చేయుచేతలే తనయాత్మ ముందుకు పోవుటకును, వెనుకకు తగ్గుటకును కారణములు ; వేరేదియు కాదు.


మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినో౽నిత్యాస్తాం స్తితిక్షస్వభారత.


చలియు, వేడియు, సుఖమును, దుఃఖమును, కలిగించు అణువుల స్పర్శములవలన వచ్చుచుండును, పోవు