పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుష్యుడు విషయములను ధ్యానించునప్పుడు వానితో నతనికి తగులుబాటు కలుగును. ఆసంగమువలన కామమును, కామమువలన క్రోధము పుట్టును. 2-62


క్రోధాద్భవతి సమ్మోహస్స మ్మోహాత్స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి.


క్రోధమువలన మోహమును, మోహమువలన మర పును, మరపువలన బుద్ధినాశము. దానివలన మనుష్యుడు నశించును. 2-63


ఇంద్రియాణాం హి చరతాం యన్మనో౽నువిధీయతే
త దస్య హరతి ప్రజ్ఞామ్ వాయుర్నావమి వాంభసి.


ఒకని యింద్రియములు బయటికి చరించునపు డతని మనస్సును వానివెంబడినే చలించును. సముద్రములో గాలిచే తత్తరించు నోడవలె వానిమతియు సంచలించును. 2-67


మొదట ఆశయును మనస్సంతోషమును అమృతము వలె కనిపించును. పిదప విషమేయగును. ఇవి మనుష్యునికి నిజముగ సుఖమును తేజాలవు. దుఃఖముతోనే అవి సమాప్తి నొందును. ఇంద్రియములను మనస్సును నడచుట మొదట విషమువలె కనబడును. కాని ఆమందే పిదప జ్ఞానముచే గలిగిన యమృతమునుబోలిన సుఖానందమును తెచ్చును.


సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాన్తంచ నిగచ్ఛతి.