పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మనాశమునకు కారణమయిన, కామము, క్రోధము, లోభము నయిన యీ మూడును నరకమునకు ద్వారములు. కాబట్టి యీ మూటినిగూడ విడువుము. 16-21


ఏత్వై ర్విముక్తః కౌంతేయ తమోద్వారై స్త్రిభిర్నరః
ఆచర త్యాత్మన శ్శ్రేయ స్తతో యాతి పరాంగతిం.


ఈ మూడు చీకటి ద్వారములనుండి తప్పించుకొనిన వాడు తన యాత్మశ్రేయస్సును వెదకికొనగలడు. దాని మూలమున పరగతిని బొందును. 16-22


యతతోహ్యపికౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభంమనః.


జ్ఞానమను తపశ్చర్యను గలవాని మనస్సునుగూడ ఇంద్రియములు బలవంతముగ నాకర్షించును. 2-60


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః
వశేహియస్యేన్ద్రియాణి తస్యప్రజ్ఞాప్రతిష్ఠితా.


వాని నన్నిటిని బాగుగ నడచి, యోగమున నెలకొని, మనస్సును నాయందేయుంచి, యింద్రియములను వశముచేసి కొన్నవానినే నిశ్చితమైన జ్ఞానము గలవానినిగా తలప వలెను. 2-61


ధ్యాయతో విషయాన్ వుంసస్సంగస్తేషూప జాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో౽భిజాయతే.