పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యజ్ఞార్ధాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః.
తదర్ధం కర్మకౌంతేయ ముక్తసంగ స్సమాచర॥


యజ్ఞముకొరకు చేయబడు కర్మముతప్ప తక్కిన పనులు మనుష్యులకు బంధనకారులగును. కావున, సంగమును విడిచి, కర్మమును చేసికొనుచుండుము. 3-9


మనస్సున వైరాగ్యబుద్ధి చొచ్చినతోడనే లోకవ్యవహారమును విడుచుటయే మంచిదను మనోభావమున్నది. పురాతనోపదేశము లనేకము లిట్టివియే. కాని, గీత మనస్సు పరిపక్వముగా లేని సన్యాసమును ఖండించి, వేరుమార్గము జూపుచున్నది. ఇదియే గీత గొప్పతనము.


పూర్వకర్మఫలమువలనకొన్నిగుణములతో పుట్టినాము. ఆగుణములను బలాత్కారముగ నడగించుటవలన నుపయోగములేదు. మనస్సుపక్వము కాకుండునపుడు సహజగుణములను వెలిపుచ్చక యడచుట కారంభించినయెడల, అవి లోపలనే తమకార్యము నాచరించుకొనుచునే యుండును. కామ క్రోధాది వేగములు మనస్సును కలత పెట్టుచునే యుండును. పైకి శుద్ధముగను, లోపల అశుద్ధముగను నుండినయెడల నెట్టి ప్రయోజనమును లేదు. ఇది యితరులను మోసగించుటయే కాక తన్నును మోసము చేసికొనుటయే యగును. స్వార్థ మును విడిచి నిష్కామముగ పనిచేయుమార్గమే జన్మాంతర