పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్
కార్య తే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః.


ఎవ్వడు నొక్కక్షణమైనను కర్మను చేయక నిలువ చాలడు. ప్రకృతివలన గలిగిన గుణములచేత నెల్లప్రాణులును తమకు తెలియకుండగనే కర్మము చేయుటకు పురికొల్ప బడుచున్నవి. 3-5


కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా, మిధ్యాచారస్సఉచ్యతే.


కర్మేంద్రియముల నడచికొనియు నింద్రియ విషయములను మనస్సులో స్మరించు కొనుచుండువాడు మూఢుడు. వాని నడవడి మిథ్యయని చెప్పబడును. 3-6


యస్త్వింద్రియాణి మనసా నియమ్యా రభతే౽ర్జున
కర్మేంద్రియైః కర్మయోగ మసక్త స్సవిశిష్య తే॥


ఎవడింద్రియములను మనస్సుచే అరికట్టి కర్మయోగ మార్గమున కర్మేంద్రియములను నడుపుచుండునో, వాడే యుత్తముడు. 3-7


నియతం కురుకర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః,
శరీరయాత్రా౽ పి చ తే నప్రసిధ్యే దకర్మణః॥


విధింపబడిన పనులను చేయుము. పనులను చేయకుండుటకంటె చేయుటయే యుత్తమము. కర్మమును చేయకుండిన నీశరీరయాత్రయు నీకు సులభము కాచాలదు. 3-8