పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కముగావచ్చుచున్నది. కర్మయోగమనునది సంగమువీడి జ్ఞానముతో గూడ కర్మమును చేయుట. సరిగ చేసినయెడల రెండును నొక్కటే యని తెలియగలము. వానిలో నొకదానిని విడిచి మరియొకదానిని చేయజొచ్చుటవలన ఫలములేదని కనుగొనగలము.

పక్వముకాని మనస్సుతో త్యాగి కాజూచుటవలన ఫలములేదు. దానివలన మనస్సునకుసౌఖ్యముకలుగజాలదు. త్యాగపుగొప్పదనమును, ముఖ్యాంశమును, ఆశలను విడుచుటయే. ఆశలను విడిచి కర్మలను చేయవచ్చునుగదా! అట్లు చేయుటయు త్యాగమే. కావున సన్న్యాసమును కర్మయోగ మును నొక్కటే యని గీత చెప్పుచున్నది.


లోకేస్మిన్ ద్వివిధానిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేనసాంఖ్యానాం, కర్మ యోగేనా యోగినాం.


ఈలోకములో రెండు విధములైన నిష్ఠలు ముందే నాచే చెప్పబడినవి. సాంఖ్యులుచెప్పు సాంఖ్యయోగమార్గ మును, యోగులుచెప్పు కర్మయోగ మార్గమును. 3-3


న కర్మణా మ నారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్ను తే
నచ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి.


పనుల నారంభింపక యుండుటచేతనే మనుష్యుడు కర్మములను చేయనివాడు కాజాలడు. సన్న్యాసమును పూనిన మాత్రముననే మనుష్యుడు సిద్ధిని పొందచాలడు. 3-4