పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నే యాశ్రయముగ గొన్నవా డెల్లపనులను నెప్పుడును జేసికొనుచున్నను తరుగని నిత్యపదవిని నాయనుగ్రహముచే పొందగలడు. 18-56


చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్సతతం భవ.


చేయుచేతలనెల్ల నాకే యర్పణచేసి, నన్నే పర మావధిగ నెంచి బుద్ధియోగము నాశ్రయించి యెప్పుడును నన్ను చిత్తములో నిలిపియుండుము. 18-57


సుఖములేని త్యాగము.

(గీత: అధ్యాయము 3.)


మనస్సు సుఖముగానుండుట కడుగడుగునకునుధ్యానము చేయుట యావశ్యకము. ఆత్మ, లోకము, దైవము, వీని స్వరూపము నెల్లప్పుడు చింతించు చుండుటవలన మనస్సున గలుగు నుద్వేగము లడగిపోవును. కాని ధ్యానముమాత్రము చాలదు. దానితో బాటు తన కేర్పడియుండిన పనులను జేయుటయు నట్లే కర్మము నాచరించుటయందు స్వార్థమును, నాశయు విడిచి చేయుటయు మనస్సౌఖ్యమున కుత్తమమైన మార్గమగును. యోగమనిధ్యాసమునకు పేరు సాంప్రదాయి