ఈ పుట ఆమోదించబడ్డది
60
కర్మముచేత కలిగిన స్వభావగుణములచే జీవుని విడిపించుకొను మార్గమగును.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః.
అహంకార విమూఢాత్మా కర్తా హ మితి మన్య తే.
ప్రకృతివలనబుట్టిన గుణములు అన్ని కర్మలకు
కారణము. ుతె అహంకారభావముచే గలిగిన మోహము
చేత తానే చేయువాడ ననుకొనును. 3-27
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః,
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జ తే.
గుణము, కర్మము, వీని విభాగములను దెలిసినవాడు
గుణములు గుణములలో తిరుగుచున్నవని తెలిసి, వానినుండి
ప్రత్యేకముగ నుండును. 3-28
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞానవానపి,
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి.
జ్ఞానవంతుడుకూడ తన ప్రకృతి ననుసరించియే నడచు
కొనును. ప్రాణులన్నియు ప్రకృతిని వెంబడించి నడచు
చున్నవి. నిగ్రహమువలన ప్రయోజనము లేదు. 3-33