పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కున్నను, సమముగానిలిచిన వాడై మనస్సులో కొరతల కెడమీయనివాడై నిలుచువాడు కర్మమును జేసినను దానిచే కట్టుపడడు. 4-22


కర్మణ్యే వాధికార స్తే మాఫలేషు కదాచన
మా కర్మఫలహేతు ర్భూర్మాత్మే సంగో౽స్త్వకర్మణి.


కర్మమును జేయుటయందు మాత్రమే నీకధికారము. దానిఫలములం దెన్నడును నీకధికారములేదు. చేసినదానిఫల మును కోరకుము. కాని, కర్మమును చేయకుండుటయందు మనస్సును నిలుపకుము. 2-47


యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్యసిథ్యోస్స మోభూత్వా సమత్వంయోగ ఉచ్యతే.


యోగమునందు నిలిచి, సంగమునువిడిచి, కోరిక నెరవేరుటయు నెరవేరకుండుటయు నొక్కటేయని తలచి, పను లను చేయుము. ఈసమబుద్ధియే యోగమనబడును. 2-48