పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏది కర్మము, ఏది యకర్మము, అను విషయమున పండితులును మోహము నొందియున్నారు. కావున నీకుకర్మ స్వభావమును దెలిపెదను. దీనిని దెలిసికొని యశుభమునుండి విడబడుదువు. 4-16


కర్మణ్య కర్మ యః ప శ్యే దకర్మణి చ కర్మయః
స బుద్ధి మాన్మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్.


చేసినదానియందు చేయకుండుటను, చేయనిదాని యందు చేయుటను నెవడు తెలిసికొనునో వాడేమనుష్యులలో బుద్ధిమంతుడు. ఎల్లపనులను జేయుచువచ్చినను వాడుయోగ మును బొందియున్నవాడు. 4-18


యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త మాహుః పండితం బుధాః.


ఎవనిపనులన్నియు నాశనుండి విడబడియుండ, జ్ఞాన మనునగ్నిచే గాల్ప బడునో, వానిని పెద్దలు పండితుడని యందురు. 4-19


యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ స్సిద్ధా వసిద్ధౌ చ కృత్వా పి న నిబధ్య తే.


అప్రయత్నముగ కలిగిన లాభమును గొని సంతో షము గలవాడై, దుఃఖము తెచ్చునవియు, సుఖమునిచ్చు నవియు నను భేదమునువిడిచి. కార్యసిద్ధి కలిగినను, కలుగ