పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తిని శీఘ్రముగా బొందును. అడుగడుగునకు బాగుగ చింతించుచు, మనస్సు నేకాగ్రము చేసి యింద్రియములను మనస్సును విషయములందు త్రిప్పక స్వాధీనమందుంచుకొని ధ్యానము చేయును. అట్టిధ్యానము చేయుటవలన జ్ఞానమును పొందును. ఆజ్ఞానమువలన నెల్లజీవులయందును తనయాత్మను చూచును. అంతయును భగవంతునిదివ్య విభూతి యందడగి నిలుచుటను గాంచును.

గీతలో జెప్పబడినమార్గము లోకవ్యవహారమును చేసికొనుచునే యది తన యాంతర్యమును మట్టుకు తాకకుండజేసికొను మార్గము. కార్యమును జేయక విడిచిపెట్టుట నిజమగు త్యాగము కానేరదు. కార్యములఫలములమీద నాశను విడుచుటయే త్యాగము. మోక్షమున కనగా విడుదలకుమార్గము కార్యప్రవృత్తులందు స్వార్థము నాలోచింపక యాత్మను విడి పించుకొనుటయే. ఆస్వార్థమునుండి మరలినపిదప నేకార్యము జేసినను నది యాత్మను కర్మబంధమున కట్టదు. ఇదియేగీతా సారము. ఇట్టి స్వార్థమును విడిచినయెడల జయాపజయము లందు మనస్సును త్రిప్పక, నిష్కామియై వాడువాడు తనతన పనిని చేసినయెడల, కర్మయోగ మార్గమునకును, సన్యాస మార్గమునకును గల వ్యత్యాసము తొలగిపోవును.


కిం కర్మకి మక ర్మేతి కవయో౽ప్యత్ర మోహితాః
తత్తే కర్మప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసే౽శుభాత్.