పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన స్వభావగుణముచేతనో, తానుపుట్టిన కులము, కుటుంబము, ఉన్నస్థానము మొదలగు కారణములచేతనో తన కేర్పడి యున్న కార్యములనెల్ల సరిగ జేయవలెను. కాని ఆకార్యము లచే తనకే సుఖమో, లాభమో, కలుగవలెనను నుద్దేశ ముతో చేయగూడదు. 'నాపనిని నేను చేయవలెను' అను తలపు తప్ప, మనస్సులో కార్యమునందు తనకు ఫలము కలుగవలెనను నాశ నుంచుకొనగూడదు. లాభముకోరి యితరులు చేయునట్లే కర్మయోగియు తాను చేయుకార్యము నెక్కువ యాసక్తితో జేయును. ఉదాసీనముగా నుండడు. ఇతరులవలె పైకికనబడిననులోపలకార్య ఫలమునకును నితనికిని మధ్య ఆశ యనుబంధములేకుండ ప్రత్యేకముగ పనిజేయును. స్వీయలాభమును కోరకపనులను చేయగనే కార్యము సిద్ధించినయెడల మరల మైమరచి, సిద్దింపనియెడల క్రుంగి పోవుట కలుగదు. కార్యమునందు కష్టములును, నడ్డములును నేర్పడినయెడల వానినెట్లో సహించుకొనవలె ననిమాత్రము యోచించి చేయునేగాని వానికొరకు దుఃఖపడి మనస్సునకు కలతనొందించుకొనడు. స్వార్థము నపేక్షించని వానికి శాంతము తనంతటతానే వచ్చును. సుఖమును, దుఃఖమును, జయమును, అపజయమును, అతనిని తాకజాలవు.

ఈవిధము ననుసరించి పనులనుజేయ నలవాటుపడిన సాధకుడు యోగమున పైకిపోవుటకు కావలసినమార్గములందు