పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయబడిన విషయములో మనమును మనబుద్ధియు చేరి యుండనందున యీ అదృశ్యత ఏర్పడుచున్నది.

ఒకగారడివాడొక కొలనిని సృష్టిచేసి, దానిలో చేప లుండునట్లు చేయుచున్నాడని యనుకొందము. చల్లని నీటిలో నున్న చేపలా కొలనిని స్వాభావికసృష్టిగనే యెంచును. ఆహారమును సంపాదించుకొని, యొక యాశ్చర్యమును బొందక, తమజీవితమును వ్యాపారమును సాగించుచుండును. గారడివానిచేత సృష్టింపబడినవానిబుద్ధికి, గారడివాని యునికియు సంకల్పమును దెలియదు. ఉన్నపాటున నతడా కొలని నీటిని వేడినీళ్లుగచేసి, చేపలకు దుఃఖము నేర్పాటు చేసిననుగూడ చేపలు దాని కొక కారణమును చూచుకొని శాంతినొందును, లేదా చచ్చును. అంతే. గారడివాడు బయ టికి కనబడడు. లేదా, వేడినీటిలో కూడ ఆచేపలు జీవించి యుండుటకు గారడి వాడేమిచేసినను, వారిలో విజ్ఞాన శాస్త్ర జ్ఞులై పరిశోధనచేయుచేపలు తమ స్వభావవిధిని పుస్తకము లలో వ్రాయుదురు. ఇట్లే యీశ్వరుడును మరుగుననుండి నిలిచియున్నాడు.

అంతయును నీశ్వరనియమమునకు లోబడి నిలిచియున్నను, కారణకార్యసంబంధమున నున్న గొప్ప స్వాతంత్య్రము మన మనుభవించు చున్నాము. కారణమునకును