పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనము దినదినమును చూచు ప్రకృతిధర్మమే పెద్ద యాశ్చ ర్యము. అదియే చాలు నీశ్వరునియందు భక్తి కాధారమును కల్పించుటకు. నేడు సూర్యుడుదయించి యస్తమించి, రేపు తిరిగి ఉదయింపకుండినను,అదియు బ్రకృతిధర్మములో చేరునే కాని, యది మాత్రము ప్రత్యేకముగా యాస్తిక నిదర్శనము కాజాలదు. వానయు, మెరుపును, గాలియు, భూకంపమును నొక్కొక్కసమయమున నియమము తప్పివచ్చును. ఒకనాడుండువిధము మరునాడు లేదు. దానిని చూచి తృప్తిపడుదుమా? ఏదియైనను, ఏవిధమున కనబడినను, వానికన్నిటికిని కలిపి యొక్కటే పేరిచ్చుచున్నాము. 'ప్రకృతి' లేక 'స్వభా వము' అని. కావున నున్నపాటున క్రొత్తగా నియమమును తప్పినడచినయెడల నొక లాభమును లేదు. నియమమనునది పుస్తకములో వ్రాయబడి యున్నదికాదు. ఇదివరకు లేని యొక క్రొత్తదానిని చూచినను నదికూడ ప్రకృతి నియమములోనే చేరును.

ఈశ్వరుని సంకల్పము తాను కనబడక, మరుగుననుండి, సకలమును కారణకార్యరూపమున నడిపించుచుండుటయే. దీనినే పైగీతాశ్లోకములలోని తుదిరెండు శ్లోకములు చెప్పుచున్నవి. 'మరుగుపడి యున్నా డీశ్వరుడు' అనుదాని తత్త్వమేమి? ఏతత్త్వమును పరీక్షచేయుచున్నామో దానిలో పరిశోధన చేయుచున్న మన మిమిడి యున్నాము. పరిశోధన