పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రీతిగా జేసినదని చెప్పుట సరికాదు. కలరాయో, ప్లేగు జ్వరమో, చాలామందిని చంపినవి అనునప్పుడు కలరా యను నొకరాక్షసుడు, లేదా ప్లేగుఅను నొకయసురు డిందరు మనుష్యులను తనకెరగా జేసికొన్నాడని చెప్పుట సరికాదు. అదిమనముచూచినవిషయములనుసంగ్రహముగా చెప్పువిధమే తప్ప, కార్యమునకు కారణమునుచూచి గ్రహించు విధము కాదు. ఇట్లే ఒకదానినిగూర్చి యిది ప్రకృతివిధి యనిన, కారణమును జూచి గ్రహించితిమనుటకాదు. ప్రకృతిధర్మమనునదియు, ఈశ్వరసంకల్పమనునదియు నొక్కటే. ఈశ్వర సంకల్పముననే ప్రకృతివిధి యేర్పడియుండును. ఈశ్వరుడున్నాడని యనుకొందమన్న ప్రకృతివిధి నాతడు సంకల్ప ముగా నేర్పాటుచేసికొని యుండవలెను.

మనవేడుకకు లేక సంతోషమున కీశ్వరుడు తన సంకల్పమును మార్చుకొనడు. స్వభావనియతి యనునది యతని సంకల్పము. అది దినదినమును మారిమారి అనగా ఒకనాడుండినది మరునాడుండక వ్యవస్థలేకయే, లోకమును నడిపించుటను చూచుచున్న కారణము చేతనే ఈశ్వరుడను నొక చేతనాశక్తి యున్నదని ఒప్పుకొనవలయు నని వాధించుట మూఢత్వము. ఈమౌర్ఖ్యముచేతనే యాస్తి కతకాధారముగా వేనినైన నాశ్చర్యకరములగు సంభవములనే కొన్నిమతములవారు వెదకికొనిచున్నారు. సాధారణముగ