పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యించి యుండలేదు. ప్రాణులకుండిన ప్రత్యేకత్వమును నా వలననే కలుగుచున్నది. 9-5

ప్రకృతిధర్మముననుసరించి జగమంతయు నడచివచ్చుచున్నది. ఈప్రకృతి ధర్మమును భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు తెలిసికొని నిర్ధారణ చేసియున్నారు; ఇంకను చేయుచునే యున్నారు. అయినను నీప్రకృతిధర్మమెట్లున్నదో విజ్ఞాన శాస్త్రమున గానవచ్చుటలేదు. ఒకనిర్మాణము లేక యంత్రము లేక ప్రాణి దేహస్వరూపము, అంగములకూర్పు, గుణము, అవిచేయు కార్యవిధానము వీనిని పరిశోధించి నిశ్చయించి చెప్పుట విజ్ఞానశాస్త్రమునకును విషయము. ఆప్రకృతి నియమ మెట్లున్నదని తెలియుట కాశాస్త్రమునకు సాధ్యముకాదు. 'ప్రకృతివిధి' 'స్వభావనియమము' అనునప్పుడు స్వభావమును నొక ప్రత్యేకశక్తి యుండుననియు అది యేర్పరుచువిధిని భూతపదార్థము లనుసరించి వచ్చుచున్నవనియు చెప్పుట సరికాదు. మనము పరిశోధించి కనుగొనిన కూర్పునకు సంగ్రహముగా మనమొసగు పేరుమాత్రమే 'స్వభావము.' అట్టిపేరు పెట్టినంతమాత్రముననే మూలకారణమును చూచి గ్రహించినట్లుకాదు. ఒకపేరే కారణమైయుండదు. జ్వరము వచ్చినవానికి తలనొప్పియుండును. జ్వరము తలనొప్పిని కలి గించిన దందుము. 'కామిలరోగము కంటిని పచ్చగాచేసినది' అందుము. 'కామిల' అనునొక పిశాచమో, భూతమో, యా