పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః
మూఢో౽యం నాభిజానాతిలోకోమామజ మవ్యయం.


యోగమాయచేత చుట్టబడి యుండుటవలన లోకము లో నెవరికిని కనబడను. ఈజ్ఞానములేని లోకులకు పుట్టుకయు నాశమును లేని నన్ను గూర్చి తెలియదు. 7-25


ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత
సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప.


ఇచ్ఛాద్వేషములచేత గలిగిన రెండు విధములగు మోహమువలనను నెల్లప్రాణులును లోకములో మోహము నకు వశమగుచున్నవి. 7-27


మయా తత మిదం సర్వం జగ దవ్యక్తమూర్తి నా
మత్స్థాని సర్వభూతాని నచాహం తే ష్వవస్థితః


అవ్యక్తమూర్తితో నే నీలోకమంతటను వ్యాపించి నిలుచుచున్నాను. నాలో భూతములన్నియు నెలకొనియున్నవి. నానెలవు వానిలో లేదు. 9-4


న చ మత్స్థాని భూతాని పశ్యమే యోగ మైశ్వరమ్
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః.


మరియొక విధముగ చూచినచో భూతములు నాలో నిలిచియుండలేదు. నా యీశ్వరయోగమును జూడుము. ప్రాణులను నేనే ధరించుచున్నాను. అయినను వాని నాశ్ర