పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజమే. కాని కర్మవిధి యీశ్వరుని చేష్టయే, వేరుకాదు. కర్మ విధి యనునది దైవముకాదు. అది దైవముచే నేర్పరుపబడిన యొకవిధి. జగమంతయు నొక చక్కని ప్రణాళికకు లోబడి యున్నది. అట్టి ప్రణాళికలో కర్మవిధియు నొకటి.

"ఔనౌను ! ఇదియొక కల్పనయేకాని వేరుకాదు. తల్లిదండ్రుల మొగము పోలిక, గుణము, ఇవి వారి సంతా నమునకును సంక్రమించుచున్నవి. ఇదే మన యనుభవము." అని కర్మవిధి కాక్షేపణ చేయవచ్చును. కాని యిది యాక్షేపణ కాదు. ఏయాత్మయే దేహమును ధరించుననుమాటవేరు. తండ్రి వలె కొడుకుండును అను దేహధర్మము వేరు. కొడుకుదేహమును గుణమును తండ్రినుండి సంపాదించినవగును, కాని యే తండ్రి కెవడు కొడుకై పుట్టినాడో ఎవరికితెలియును? కొడుకు దేహము తండ్రిదేహమును పోలియుండుననుట నిజమే. కాని ఆకొడుకుదేహములోనే ఆత్మచొచ్చియున్నదనుట వేరువిష యము. దానిని కర్మవిధి నిశ్చయించుచున్నది.

చెడురూపమునో, చెడుగుణములనో కొని యొకడు కడుపులోప్రవేశించి ఆరూపమును, ఆగుణములను పొందును. కాని అట్లు పొందుట కేయాత్మ తనకర్మముచేత తగియుండునో, యాఆత్మ యాతండ్రికడుపున పుట్టును. శరీరము, గుణము, ఇవి కర్మముచేతను పరంపరాగతములై యుండును. ఈ పరంపరకు